ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న చైనా ఓ ఘనతను సాధించింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న 5జీ సేవలను ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై అందుబాటులోకి తెచ్చింది..5G Signal on Mount Everest.
చైనా ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 1.42 మిలియన్ డాలర్లను వెచ్చించింది. టిబెట్ చైనా సరిహద్దుల్లో హిమాలయ పర్వతం వైపు ఈ సిగ్నల్ అందుబాటులో ఉంటుందని చైనా వెల్లడించింది.
5జీ సేవలు అందుబాటులోకి రావడంతో ఎవరెస్ట్ పై కూడా పర్వతారోహకులు ఇంటర్నెట్ను ఎంజాయ్ చేసే అవకాశం కలిగింది.
ఎవరెస్ట్ పై 5,800 మీటర్ల వరకు బేస్ క్యాంపులు ఉన్నాయి. 6,500 మీటర్ల వద్ద ఇటీవల కొత్త బేస్ క్యాంపును నిర్మించారు. 5జీ టవర్‌ను ఈ బేస్ క్యాంప్‌లోనే ఏర్పాటు చేశారు.
దీంతో ఎవరెస్ట్ పై వరకు 5జీ సిగ్నల్ అందుబాటులోకి వచ్చింది. ఈ 5జీ నెట్వర్క్ సేవలు పరిశోధకులకు, పర్వతారోహకులకు, కార్మికులకు ఉపయోగపడతాయని, ఆపదలో ఉన్నవారిని రక్షించేందుకు సాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
కాగా, అత్యంత వేగవంతమైన డేటాతో పాటు ఎక్కువ నెట్వర్క్ సామర్థ్యాన్ని 5జీ కలిగి ఉంటుంది. అత్యంత క్వాలిటీ గల 5జీతో ఎక్కువ పరికరాలను కనెక్ట్ చేయవచ్చు.
వర్చువల్ సమావేశాలకు ఇది ఎంతో మెరుగైన సేవలు అందిస్తుంది.
5G Signal on Mount Everest .. ఎవరెస్ట్‌పై 5జీ సిగ్నల్.. చైనా ఘన విజయం..