Jr NTR Challenge Balayya Chiru RajaMouli Telugu Idol
Jr NTR Challenge Balayya Chiru RajaMouli Telugu Idol

`బి ది రియ‌ల్ మేన్‌` పేరుతో ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా.. రాజ‌మౌళికి ఓ ఛాలెంజ్ విసిరిన సంగ‌తి తెలిసిందే. ఇంటి పనుల్లో భార్య‌కు స‌హాయం చేయాలన్న‌దే ఈ ఛాలెంజ్‌ ఉద్దేశం. ఈ స‌వాలు స్వీక‌రించిన రాజ‌మౌళి – ఇంటి ప‌నులు చేసి, మ‌రో ముగ్గురికి స‌వాల్ విసిరాడు. అందులో ఎన్టీఆర్ ఒక‌డు.

ఎన్టీఆర్ కూడా ఆ ఛాలెంజ్ స్వీక‌రించి, ఓ వీడియో పోస్ట్ చేశాడు. చేస్తూ చేస్తూ చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్‌ల‌తో పాటు బాల‌కృష్ణ‌కూ ఈ స‌వాల్ విసిరి.. రిసీస్‌ని కంటిన్యూ చేశాడు. చిరంజీవి, నాగ్‌, వెంకీల మాట ప‌క్కన పెడితే – బాల‌కృష్ణ ఈ స‌వాల్ ని స్వీక‌రిస్తాడా, లేదా? అనేది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ ఛాలెంజ్ లో ఎన్టీఆర్… బాల‌య్య‌ని ఎంచుకోవ‌డ‌మే పెద్ద ట్విస్టు.

ఈ ఛాలెంజ్‌ని బాల‌య్య స్వీక‌రిస్తే.. ఎలా ఉంటుంద‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. ఇటీవ‌ల చంద్ర‌బాబు నాయుడు పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. సెల‌బ్రెటీలంతా సోష‌ల్ మీడియా వేదిక చేసుకుని చంద్ర‌బాబుకి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ విష‌యంలో పార్టీల‌కు అతీతంగా స్పందించారంతా. అయితే.. ఎన్టీఆర్ నుంచి మాత్రం ఎలాంటి ట్వీటూ రాలేదు.

ఎన్టీఆర్ ఛాలెంజ్ స్వీక‌రించే అవ‌కాశ‌మే లేద‌ని కొంత‌మంది నంద‌మూరి ఫ్యాన్స్‌న‌మ్ముతున్నారు. మ‌రి బాల‌య్య ఏం చేస్తాడో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here