Ap-districts map Telugu Idol
Ap-districts map Telugu Idol

కరోనా సర్కారు అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాలకూ భారీ నష్టమే మిగులుస్తోంది. కరోనా కారణంగా లాక్‌ డౌన్ విధించాల్సి వచ్చింది. దీంతో ఎక్కడ వ్యాపారాలు, కార్యకలాపాలు అక్కడే ఆగిపోయాయి. అన్ని సంస్థలు మూతబడ్డాయి. కేవలం నిత్యవసరాల షాపులు, ముందుల షాపులు మాత్రమే తెరుచుకున్నాయి. ప్రభుత్వాలకు ఆదాయం ఇచ్చే మద్యం షాపులకూ తాళాలు పడ్డాయి.

దీంతో రాష్ట్రాలకు ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీనికి తోడు.. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వైద్య చికిత్సలు, ప్రజలకు ఉచితంగా సరకులు అందించడం ఇలా అనేక అదనపు ఖర్చు వచ్చాయి. దీంతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. ఏపీ విషయానికి వస్తే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి.

ఏపీలో వచ్చే ఆదాయం రాకపోగా 13 వేల కోట్ల అదనపు భారం పడిందని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన రాబడి దాదాపు ఆరువేల కోట్ల నష్టం వచ్చిందట. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కాలానికి కనీసం రూ.6,000 కోట్లు ప్రభుత్వం కోల్పోయినట్లేనని చెబుతున్నారు.

దీనికి తోడు కరోనా కాలంలో వివిధ వర్గాలకు సాయం చేయడానికి కాని, పేదలకు వెయ్యి రూపాయల పంపిణీ , వైద్యం, కరోనా నియంత్రణకు అయిన వ్యయం ఇలా మొత్తం కలిపి రూ.4,000 కోట్లకు పైగా ఉంటుందని మరో అంచనా. మొత్తం మీద ఈ ఖర్చులన్నీ కలిపి ఇప్పటి వరకు దాదాపు రూ.13,000 కోట్ల మేరకు ఏపీ సర్కారుపై భారం పడిందని లెక్కలు వేస్తున్నారు. అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం.. ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయటపడుతుందో మరి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here