Corona Virus Men Women .. మగవారి పై కనికరం లేని కరోనా .. వైరస్ తీవ్రత పురుషుల్లోనే ఎక్కువగా
కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టడానికి అనేక దేశాల్లో ఎందరో శాస్త్రవేత్తలు పరిశోధనలు, అధ్యయనాలు చేస్తున్నారు.
ఈ ఏడాది ముంగింపూలోపు కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు చేస్తున్న ఆయా పరిశోధనల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి.
తాజాగా నెదర్లాండ్స్ కు చెందిన యూనివర్శిటీ మెడికల్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో కరోనా వైరస్ తీవ్రత మహిళల్లో కంటే పురుషుల్లోనే ఎక్కువగా ఉంటుందని శాస్త్రీయ ఆధారాలతో రుజువైంది.
ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ ఆండ్రియాన్ వూర్స్ దీని గురించి స్పందించారు.
‘మహిళల్లో, పురుషుల్లో యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ 2 (ఏసీఈ 2) అనే ఎంజైమ్ సాయంతో కొవిడ్-19 కారక ‘సార్స్ -కొవ్2’ వైరస్ కణాల్లోకి ప్రవేశిస్తున్నట్టు గుర్తించాం.
ఈ ఎంజైమ్ మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువగా ఉండటంతో ‘కరోనా’ ప్రభావం పురుషుల్లోనే అధికంగా ఉంది.’ అని వూర్స్ తెలిపారు.
ఏసీఈ2 ఎంజైమ్ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలలో కంటే వృషణాల్లో ఎక్కువగా ఉంటుందని, అందుకే పురుషుల్లో ఈ వైరస్ తీవ్రత అధికంగా ఉంది.
ఈ వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడానికి కూడా ఈ ఎంజైమే దోహదపడుతోంది. అందుకే కరోనా సోకిన వారికి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా బారినపడి మరణిస్తున్న వారిలో అధికశాతం పురుషులే ఉండటంతో ఈ కోణంలోనూ అధ్యయనం చేయడంతో ఏసీఈ2 వల్లేనని గుర్తించామని అని వూర్స్ అన్నారు.
Corona Virus Men Women .. మగవారి పై కనికరం లేని కరోనా .. వైరస్ తీవ్రత పురుషుల్లోనే ఎక్కువగా