Allu Arjun reacts to David Warner’s dance with wife Candice on “Butta Bomma” song .. అల్లు అర్జున్ ‘బుట్టబొమ్మ’ సాంగ్ మరో రికార్డ్ .. DavidWarner Dance in Allu Arjun Butta Bomma Song
అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెల్సిందే.
రెండేళ్ల గ్యాప్ తరువాత వచ్చిన ఈ సినిమా బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి.
సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని ‘సామజవరగమనా’ పాట పెద్ద హిట్ అయింది. అలాగే ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాములో..’ పాటలు సినిమాకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి.
‘బుట్టబొమ్మ’ సాంగ్ డాన్స్ కి ఎందరో ఆకర్షితులయ్యారు. ఇటీవల ఈ సాంగ్ మరో మైలురాయిని దాటేసింది.
దీనికి సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్ నెల రోజుల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో రిలీజైనప్పటి నుంచి ట్రెండ్ అవుతూనే ఉన్నది.
ఇప్పటి వరకు 150 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. లిరికల్ సాంగ్ 50 మిలియన్ వ్యూస్ కలుపుకుంటే మొత్తం 200 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం.
బుట్టబొమ్మ సాంగ్ అభిమానులు ఈ పాటకు డాన్స్ చేసి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వారిలో బాలీవుడ్ స్టార్స్ కూడా ఉండడం గమనార్హం.
ఇటీవల ఈ పాటకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన భార్యతో డ్యాన్స్ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్నీ ధరించిన వార్నర్ తన భార్యతో కలిసి ఈ పాటకు డాన్స్ చేసి టిక్‌టాక్ లో షేర్ చేశాడు.
వీళ్ళు డాన్స్ చేస్తుంటే వెనకాల తన కూతురు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Allu Arjun reacts to David Warner’s dance with wife Candice on “Butta Bomma” song .. అల్లు అర్జున్ ‘బుట్టబొమ్మ’ సాంగ్ మరో రికార్డ్ .. DavidWarner Dance in Allu Arjun Butta Bomma Song ..