Dil Raju Gets Married .. దిల్ రాజు వివాహం తేజస్విని(వైఘా రెడ్డి)తో జరిగింది
గత కొన్ని రోజులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ రెండో పెళ్లిపై వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఆదివారం రాత్రి ఆయన మరో పెళ్లి చేసుకున్నారు.
కొద్ది మంది సన్నిహితుల సమక్ష్యంలో నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్ పల్లిలోని వెంకటేశ్వర స్వామీ దేవాలయంలో ఈ కార్యక్రమం నిర్వాహించారు. దీంతో ఆయనకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్న ఆ యువతి ఎవరని చర్చకు తెరపడింది . సొంత గ్రామమైన నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్‌పల్లిలో దిల్ రాజు వివాహం తేజస్విని(వైఘా రెడ్డి)తో జరిగింది.
తన ఇష్ట దైవమైన శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో అతికొద్దిమంది బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. తేజస్విని గతంలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేసిందట. ఆమె ఫ్యామిలీ అమెరికాలో స్థిరపడినట్టు సమాచారం.
ఇక దిల్ రాజు పెళ్లికి పెద్దగా ఆమె కూతురు హన్షితరెడ్డి వ్యవహరించింది. 2014లో హన్షితరెడ్డికి వివాహం కాగా.. 2017లో తన తల్లిని కోల్పోయింది.
అప్పటి నుంచి తన తండ్రికి రెండో పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారట హన్షితరెడ్డి. మదర్స్ డే రోజున తండ్రి దిల్‌రాజుకి దగ్గరుండి వివాహం జరిపించింది.
తన తండ్రికి బాగా తెలిసిన అమ్మాయే తనకు తల్లిగా వస్తుండటంతో హన్షితరెడ్డి ఎంతో ఆనందంగా ఉందట. మాతృ దినోత్సవం రోజున తండ్రికి పెళ్లి చేయడం విశేషం.
Dil Raju Gets Married .. దిల్ రాజు వివాహం తేజస్విని(వైఘా రెడ్డి)తో జరిగింది.