Free software coaching in PHP and MySQL ..ఉచితంగా PHP, My SQL ఆన్‌లైన్ కోర్సులు
Free software coaching in PHP and MySQL ..ఉచితంగా PHP, My SQL ఆన్‌లైన్ కోర్సులు

Free software coaching in PHP and MySQL ..ఉచితంగా PHP, My SQL ఆన్‌లైన్ కో

Free Coaching: ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా విద్యా సంస్థ‌లు మూత‌ప‌డ‌డంతో విద్యార్థులంతా ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. మ‌రి ఈ ఖాళీ స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా ఆన్‌లైన్‌లో ఏదైనా కోర్సు నేర్చుకుంటే కెరీర్‌కు ఉప‌ప‌యోగ‌ప‌డుతుంది క‌దూ.. అయితే ఆన్‌లైన్ కోర్సుల‌కు కూడా ఇటీవ‌ల బాగా ఫీజులు వ‌సూలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే దేశంలోనే ప్ర‌ముఖ విద్యా సంస్థ‌ల్లో ఒక‌టైనా ఐఐటీ బాంబే ఆన్‌లైన్ కోర్సుల‌ను అందిస్తోంది. పీహెచ్‌పీ, మై ఎస్‌క్యూఎల్ కోర్సుల‌ను ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చింది.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఈ కోర్సుల‌ను నేర్చుకోవాల‌ని ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు స్వ‌యం (SWAYAM) ప్లాట్‌ఫామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
* ముందే రికార్డు చేసి ఉండే ఈ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్ (ఎఫ్‌డీపీ‌)ను ఏఐసీటీఈ ఆమోదించింది.
* 15 వారాల గ‌డువుల్లో పూర్త‌య్యే ఈ కోర్సుకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ వీడియో, ఆడియో ఫార్మాట్లలో అందుబాటులో ఉంది.
* పీహెచ్‌పీ ప్రోగ్రామ్‌ లాంగ్వేజ్‌ను నేర్చుకునేందుకు అవసరమైన 57 ఆడియో, వీడియో రూపంలో పాఠ్యాంశాలు ఉన్నాయి.
* వెబ్‌సైట్ డిజైన్ కోసం పీహెచ్‌పీ లాంగ్వేజ్ ఉప‌యోగ‌ప‌డుతుంది.
* ఈ కోర్సుల‌కు సాఫ్ట్‌వేర్‌ యూజర్లు, డెవలపర్లు, ట్రైనర్లు, రిసెర్చ్‌ స్కాలర్లు, ఐటీ రంగంలో పనిచేస్తున్నవారు, యూజీ, పీజీ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
* ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://onlinecourses.swayam2.ac.in/లో రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

Free software coaching in PHP and MySQL ..ఉచితంగా PHP, My SQL ఆన్‌లైన్ కోర్సులు

Full Free Coaching: ఉచితంగా PHP, My SQL ఆన్‌లైన్ కోర్సులు అందిస్తోన్న ఐఐటీ బాంబే.. ఎలా అప్ల‌య్ చేసుకోవాలంటే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here