Happy Birthday Sai Pallavi Virataparvam First Look Released .. సాయిపల్లవికి ‘విరాటపర్వం’ చిత్రబృందం సర్ ప్రైజ్ గిప్ట్
నేడు సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా ఈ మూవీలో ఆమె లుక్ ను రిలీవ్ చేసి చిత్రబృందం అందరినీ సర్ ప్రైజ్ చేసింది.
మే 9న సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా ఆమె అభిమానులకు ‘విరాటపర్వం’ చిత్రబృందం సర్ ప్రైజ్ గిఫ్ట్ అందించింది. ‘ఫిదా’ మూవీతో తెలుగు ప్రేక్షకులను సాయిపల్లవి మెస్మరైజ్ చేసింది.
న్యాచురల్ బ్యూటీగా పేరుతెచ్చుకొని వైవిధ్యమైన కథలతో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళంలో స్టార్డమ్ సంపాదించుకుంది.
ప్రస్తుతం ఆమె రానా హీరోగా నటిస్తున్న ‘విరాటపర్వం’ మూవీలో నటిస్తుంది. వేణు ఉడుగుల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘విరాటపర్వం’లో సాయిపల్లవి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ సాయిపల్లవి పాత్రపై తొలి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ వార్తలు విన్పించాయి.
అందుకు తగ్గట్టుగా నేడు చిత్రబృందం సాయిపల్లవి సర్ప్రైజింగ్ లుక్ విడుదల చేసింది. అడవిలో అమరవీరుల స్థూపం వద్ద మెరూన్ కలర్ లంగావోణిలో తీక్షణంగా చూస్తూ ఉంటుంది.
ఆమె పాత్ర సినిమాకు ఎంతో కీలకమో ఈ లుక్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ దాదాపు గా పూర్తి దశకు చేరుకుంది.
లాక్డౌన్ ముగిశాక మిగతా భాగం కాంప్లీట్ చేసి రిలీజ్ తేదిని ప్రకటించాలిసి ఉంది . ఈ మూవీలో నందితా దాస్, ప్రియమణి కూడా నటిస్తున్నారు.
ఈ మూవీని డైరెక్టర్ సురేష్ బాబు, చురుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ గిప్ట్ ఇచ్చి మూవీపై భారీ అంచనాలను పెంచడంలో చిత్రబృందం సక్సస్ అయిందనే చెప్పొచ్చు.
Happy Birthday Sai Pallavi Virataparvam First Look Released .. సాయిపల్లవికి ‘విరాటపర్వం’ చిత్రబృందం సర్ ప్రైజ్ గిప్ట్