రాయలసీమలోని మహత్తర మహిమాన్విత మానవీయ మూర్తులలో శ్రీ అవధూత కాశిరెడ్డి నాయన ఆధ్యాతిక గురువుగా పేరుపొందారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉదయగిరి తాలూకా, సీతారామపురం మండలంలోని బెడుసుపల్లిలో కాశిమ్మ,సుబ్బారెడ్డి దంపతులకు రెండవ సంతానంగా జన్మించిన కాశిరెడ్డి నాయన పూర్వనామం మున్నల్లి కాశిరెడ్డి.
అతిరాచ గురవయ్య స్వామిచే ప్రభావితులై, ఆధ్యాత్మిక తత్వానికి, ధార్మిక,మానవ సేవకు పునాదులు వేసుకున్న కాశినాయన చిన్నప్పటి నుండే పలుతీర్ధయాత్రలు చేసి,అశేషమైన విశేష ధార్మిక జ్ఞానాన్ని తమ సాధన ద్వారా సాధించుకున్నారు. కాశీనుండి కన్యాకుమారి వరకు, ఆయన దర్శించని పుణ్యక్షేత్రం లేదంటే అతిశయోక్తికాదు.రాయలసీమకు ముఖ్య కేంద్రమైన కడప జిల్లాలో కాశినాయన పేరుమీద జ్యోతి క్షేత్రం వెలిసింది. ఆయన సమాధి ప్రాంతం ప్రస్తుతం సప్తమ జ్యోతిక్షేత్రంగా వెలుగొందుతోంది.
భక్తుల సహకారంతో కాశినాయన పేరుమీద ఒకపెద్ద దేవాలయం నిర్మిస్తున్నారు. 1995 డిసెంబర్లో భౌతికకాయాన్ని విడిచిన కాశినాయన జ్ఞాపకార్ధం రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలోని నరసాపురం కేంద్రంగా, కాశినాయన పేరిట మండలాన్ని ఏర్పాటు చేసింది.
ఆళ్ళగడ్డకు 50 కిలోమీటర్ల దూరంలో వున్న క్షేత్రంలో జరిగే ఆరాధన ఉత్సవాలలో వేలాదిమందికి అన్నదానం జరుగుతుంది. నిరతాన్నదానం, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ కాశినాయన ఆశయం,ఆయన ఆశయాన్ని నెరవేర్చే భక్తులు రాష్ట్రంలోని నాలుగు చెరగులా ఆయన పేరిట, ఆశ్రమాలు ఏర్పాటుచేసి నిత్యాన్నదానం, గోపోషణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవధూత కాశినాయన జీవిత విశ్లేషణ చేస్తూ అనేక గ్రంధాలు వెలివరించబడినాయి.
ఆయన పేరు మీద కడప జిల్లాలో జ్యోతి క్షేత్రం వెలసింది. కాశినాయన సమాధి ప్రదేశం ఏడవ జ్యోతి క్షేత్రంగా విరాజిల్లుతోంది. కాశీనాయన పేరు మీద ఇక్కడ ఒకపెద్ద దేవాలయం నిర్మిస్తున్నారు. వీటి నిర్వహణకు సహకరిస్తున్న భక్తుల సహకారం చాలా ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంగా కాశిరెడ్డి నాయన భక్తులు, కడప జిల్లాలోని కాశినాయన మండలం లోని జ్యోతి క్షేత్రంలో కాశి నాయన ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఈ క్షెత్రం ఆళ్ళగడ్డకు 50 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. క్షేత్రానికి వచ్చిన వేలాదిమందికి అన్నదానం చేయించే ప్రక్రియను కూడా నాయనగారు ముందుగానే చేయించారు. పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా కాశినాయన ఏర్పాటు చేసారు.