Mother and Child Transmission of Coronavirus During Pregnancy
Mother and Child Transmission of Coronavirus During Pregnancy

Mother and Child Transmission of Coronavirus During Pregnancy .. పుట్టబోయే బిడ్డకి ఈ వైరస్ వస్తుందా? ప్రెగ్నెంట్స్ ఎక్కువగా కేర్ తీసుకోవాలా?

లాక్ డౌన్ టైమ్‌లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ టైమ్‌లో ప్రెగ్నెంట్స్ మరీ ఎక్కువగా కేర్ తీసుకోవాలి.. ఇలాంటి టైమ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏయే టిప్స్ పాటించాలో తెలుసుకోవాలి..

కరోనా వైరస్ కారణం గా మన జీవితాల్లో చాలా మార్పులు జరిగాయి. అనుకున్నవేవీ అనుకున్నట్టు జరిగే పరిస్థితి లేదు. దీనిలో కాబోయే తల్లిదండ్రులు బిడ్డ జననంకోసం వేసుకున్న ప్రణాళికలు కూడా ఉంటాయి.

మీ డ్యూ-డేట్ ఈ సమయంలోనే ఉంటే ఎలా? లేదా మీ ఆరోగ్యం, లేదా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి మీకేమైన సందేహాలొస్తే ఎలా? ఇలాంటి సందేహాలు చాలామంది కాబోయే తల్లిదండ్రులకి ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. కాబట్టి ‘లాక్ డౌన్ లో డెలివరీ‘ ప్లాన్ తయారుగా ఉంచుకోండి. మీ సందేహాలలో కొన్నింటికి సమాధానాలు..

​1. పుట్టబోయే బిడ్డకి ఈ వైరస్ వస్తుందా..

Mother and Child Transmission of Coronavirus During Pregnancy
Mother and Child Transmission of Coronavirus During Pregnancy

కాబోయే తల్లిదండ్రులందర్నీ వేధిస్తున్న సమస్యల్లో ఇది మొదటిది. వృద్ధులూ, గర్భిణీలూ హై-రిస్క్ కేటగిరిలో ఉన్నారు. ఈ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పట్నించీ పసిపిల్లలకి కూడా ఈ వైరస్ సోకుతున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

 

 

ఇలాంటివి జరగవు అని చెప్పకపోవచ్చు గానీ జరిగే అవకాశాలు చాలా తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. తల్లి నుంచి బిడ్డకి సోకే అవకాశం కూడా చాలా తక్కువ. ఒకవేళ తల్లిదండ్రులలో ఎవరికైనా కరోనా సోకవచ్చేమో అన్న అనుమానం ఉంటే, బిడ్డని వారినించి కొన్ని రోజులు దూరంగా ఉంచుతారు.

​2. వైద్యులని సంప్రదిస్తుండాలి..

Mother and Child Transmission of Coronavirus During Pregnancy
Mother and Child Transmission of Coronavirus During Pregnancy

ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండడం కోసం చాలా హాస్పిటల్స్ లో మిగిలిన పనులన్నీ ఆపేశారు. మీ డెలివరీ కి ముందు మీకేమైనా అపాయింట్మెంట్ ఉంటే మీ డాక్టర్ కి కాల్ చేసి కనుక్కోండి.

ఇలాంటి సమయంలో ఒకటికి రెండుసార్లు అడిగి తెలుసుకోవడంలో తప్పేం లేదు. మీ బిడ్డ జననానికి సంబంధించి ఒక ప్లాన్ తయారుచేసుకుని ఉండండి.

​3. టెక్నాలజీ గురించి తెలుసుకోండి..

ఇంటర్నెట్ ఈ సమయంలో ఎంతో సాయం చేస్తుంది. అనుకోని పరిస్థితుల్లో ఏం చేయాలనేది ఇంటర్నెట్ ద్వారా నేర్చుకోండి. కంగారు పడకండి. ఒక ప్లాన్ బీ కూడా తయారుగా పెట్టుకోండి అనే మేము చెబుతున్నాం.

బిడ్డ పుట్టడానికి ముందూ, ఆ సమయంలోనూ, తరవాతా కూడా మీ స్మార్ట్ ఫోన్ ఎంత ఉపయోగపడగలదో ఆలోచించుకోండి. వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ ద్వారా మీ వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. కొంతమంది డాక్టర్లు వర్చువల్ కన్సల్టేషన్స్ ద్వారా అందుబాటులో ఉంటున్నారు. అది కూడా చెక్ చేస్కుని పెట్టుకోండి.

​4. ఈ జాగ్రత్తలు తీసుకోండి.

గర్భం ధరించినప్పుడు మమూలుగానే రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది.అంటే, మీరు మీ కోసం, మీ బిడ్డ ఆరోగ్యం కోసం కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించండి. అత్యవసరమైతే తప్ప అడుగు బయటపెట్టకండి. ముఖ్యమైనవన్నీ దగ్గర పెట్టుకోండి. ఒకసారి మీకు నొప్పులు మొదలైన తరువాత, లేదా బిడ్డని ఇంటికి తీసుకువచ్చిన తరువాత బిడ్డకు సంబంధించిన వస్తువులన్నీ మీకు అవసరమౌతాయి. ఇవన్నీ ముందే అందుబాటులో ఉంచుకోండి. ఒకసారి మీ బిడ్డ మీ ఇంట్లో ప్రవేశించాక శానిటైజేషన్ కి అత్యంత ప్రాధాన్యతనివ్వండి. మీ బిడ్డని చూడటానికి వచ్చేవాళ్ళని రానివ్వకండి. ఈ సమయాన్ని మీ ‘కంటిదీపం’ తో గడపడానికి వాడుకోండి.

5. భయం వద్దు..

Mother and Child Transmission of Coronavirus During Pregnancy
Mother and Child Transmission of Coronavirus During Pregnancy

ఈ సమయంలో బిడ్డ పుట్టాలని నిజంగా ఎవ్వరూ కోరుకోరు. మీ గురించీ, బిడ్డ ఆరోగ్యం గురించీ ఆందోళన చెందడం సహజం. కానీ, భయపడకుండా, వైద్యనిపుణుల సలహాలు తీసుకుంటూ ఉండండి. కొంతమందికి ఇదే తొలి సంతానం కావచ్చు, తల్లులు వారొక్కరే ఈ సమయంలో ఉండడానికి ఆందోళన చెందుతూ ఉండచ్చు. మీ అమ్మలూ, మీ అమ్మమ్మ, నానమ్మలూ ఇలాంటి పరిస్థితిని ఒంటరిగానే ఎదుర్కొన్నారని గుర్తుపెట్టుకోండి, మీకు కొంచెం ధైర్యం వస్తుంది.

Mother and Child Transmission of Coronavirus During Pregnancy .. పుట్టబోయే బిడ్డకి ఈ వైరస్ వస్తుందా? ప్రెగ్నెంట్స్ ఎక్కువగా కేర్ తీసుకోవాలా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here