Pawan in Driving Licence remake .. పవన్-చెర్రీ కాంబోలో ‘డ్రైవింగ్ లైసెన్స్’? మలయాళంలో ఘన విజయం సాధించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్ రాంచరణ్ దక్కించుకున్న సంగతి తెల్సిందే.
ఈ మూవీని రాంచరణ్ తన బాబాయ్ పవన్ కల్యాణ్ కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్ ఇప్పటికే కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్లో సినిమాలు నిర్మిస్తున్నాడు.

మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ-150’తో చరణ్ నిర్మాతగా మారాడు. ఆ తర్వాత చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు ‘సైరా’ను భారీ బడ్జెట్లో నిర్మించాడు.
తాజాగా చిరంజీవితోనే ‘ఆచార్య’ మూవీని నిర్మించడంతోపాటు తండ్రితో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్నాడు. తాజాగా తన బాబాయ్ పవన్ కల్యాణ్ కు కూడా లైన్ల్ పెడుతోన్నాడు.
మెగా హీరోలంతా ఒకరి సినిమాల్లో ఒకరు గెస్ట్ రోల్స్ చేస్తూ కనివిందు చేస్తున్నారు. అయితే ఫుల్ లెన్త్ రోల్స్ మాత్రం చేయడం లేదు. రాంచరణ్ నటించిన ‘మగధీర’లో మెగాస్టార్ ఓ గెస్ట్ రోల్ చేశాడు.
‘శంకర్ దాదా జిందాబాద్’లో పవన్ కల్యాణ్, ‘బ్రూలీ’లో చిరంజీవి కన్పించి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. రాంచరణ్-అల్లు అర్జున్ కలిసి ‘ఎవడు’లో నటించారు. ఈ మూవీ భారీ విజయం సాధించింది.
తాజాగా రాంచరణ్ మెగాస్టార్ నటిస్తున్న ‘ఆచార్య’లో కీరోల్ చేస్తున్నాడు. ఈ మూవీపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్-చరణ్ కాంబోలో ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీ రానుందని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీని రాంచరణ్ నిర్మించనున్నాడు.
దీంతోపాటు ‘వేదాళం’ తమిళ మూవీని రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో పవన్ కల్యాణ్-రవితేజ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే రవితేజ బదులుగా రాంచరణ్ నటిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఒరిజినల్ వర్షన్లో మాధవన్, విజయ్ సేతుపతి నటించగా తెలుగు వర్షన్లో పవన్ కల్యాణ్, రాంచరణ్ కలిసి నటిస్తారనే ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తోంది.
మెగా ఫ్యామిలీలో రాంచరణ్-పవన్ కల్యాన్ మధ్య మంచి బాండింగ్ ఉంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లలో త్వరలోనే ఓ మూవీ వస్తుందని మెగా అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
లాక్డౌన్ అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీపై మరింత క్లారిటీ రావడం ఖాయంగా కన్పిస్తుంది. అంతవరకు మనం వేచి చూడాల్సిందే..!
Pawan in Driving Licence remake .. పవన్-చెర్రీ కాంబోలో ‘డ్రైవింగ్ లైసెన్స్’?