Pawankalyan Krish Upcoming Movie Info .. నేను లోకల్ అంటున్న పవన్ .. అనిపిస్తున్న క్రిష్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ మూవీతో బీజీగా ఉన్నారు.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో నిర్మాతలు దిల్ రాజు, బోనికపూర్ ‘వకీల్ సాబ్’గా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. పవన్ ఈ మూవీ చేస్తూనే డైరెక్టర్ క్రిష్ తో మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. మొగల్ సామ్రాజ్యం కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు డైరెక్టర్ క్రిష్.
ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా ప్రసిద్ధమైన క్యారెక్టర్లో నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. అయితే లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు ఆగిపోయాయి.
కరోనా ఎఫక్ట్ వలన ఇప్పట్లో సినిమా షూటింగులు ప్రారంభమయ్యేలా కన్పించడం లేదు. దీంతో దర్శకుడు క్రిష్, పవన్ మూవీకి సంబంధించిన లోకేషన్లలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జూన్లో సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయని సినీ పెద్దలు భోగట్టా. ఈమేరకు షూటింగులు ప్రారంభమైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
విదేశీ, ఇతర రాష్ట్రాల ప్రయాణాలకు అనుమతి లేకపోవడంతో సినిమాలను వీలైనంత వరకు లోకల్ గానే పూర్తి చేయాలని అనుకొంటున్నారు.
ఈనేపథ్యంలో డైరెక్టర్ క్రిష్ తాను పవన్ కల్యాణ్ తో తీయబోయే పీరియాడికల్ మూవీకి సంబంధించిన సెట్స్ అన్ని కూడా హైదరాబాద్లోని రామెజీ ఫిల్మ్ సిటీలే వేయించేందుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది.
90శాతం షూటింగ్ హైదరాబాద్ లోకేషన్లలోనే పూర్తి చేయాలని క్రిష్ అనుకొంటున్నారు.
అలాగే ‘వకీల్ సాబ్’ చిత్రానికి సంబంధించిన మిగతా షూటింగ్ కూడా హైదరాబాద్లోనే పూర్తి చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తుంది.
ఈనేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాన్ సినిమాలన్నీ తెలంగాణలో స్థానికంగానే పూర్తి కానున్నాయి. ఈ మూవీల తర్వాత పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కనుందని ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తుంది.
ఇది తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానుల అందానికి హద్దులు ఉండవ్.. రోజు పండగే పండగ అని సినీ వర్గాల గుసగుసలు ..
Pawankalyan Krish Upcoming Movie Info .. నేను లోకల్ అంటున్న పవన్ .. అనిపిస్తున్న క్రిష్.