Kaloji Narayana Rao Indian Poet Telugu Idol
Kaloji Narayana Rao Indian Poet Telugu Idol
ఆంగ్లమందున మాటలనగానే
ఇంత కుల్కెదవెందుకు రా
తెలుగువాడివై తెలుగు రాదనుచు
సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా
అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా!
Kaloji Narayana Rao Indian Poet Telugu Idol
Kaloji Narayana Rao Indian Poet Telugu Idol
ఇతర భాషలపై మోజుతో మాతృభాషను విస్మరించేవారిని కాళోజీ కంటే గొప్పగా ఎవరు హెచ్చరిస్తారు. అందుకే ఆయన జయంతి ‘తెలంగాణ భాషా దినోత్సవం’ అయింది. తెలుగు భాష పట్ల ఆ ప్రజాకవికి ఉన్న మమకారం ఎనలేనిది. కాళన్న కాస్త పరుషంగానే హెచ్చరించినా.. అది తెలుగు తనం పట్ల ఆయనకున్న అనంతమైన అపేక్ష మాత్రమే గానీ మరోటి కాదు. ఎక్కడో మరాఠాల కుటుంబంలో పుట్టి, వరంగల్‌కు వచ్చి స్థిరపడి ‘నాది బడి పలుకుల భాష కాదు.. పలుకుబడుల భాష.. నా మాతృభాష తెలుగు’ అని ఎలుగెత్తి చాటిన మహానుభావుడాయన. తెలంగాణ పలుకుబడితో ప్రజల మాట, వ్యధలను ఆయన వ్యక్తం చేసిన తీరు అమోఘం.. అందరికీ ఆదర్శప్రాయం.

రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ  (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) "కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న" గా సుపరిచితులు. ఆయన తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం ప్రతిధ్వని కాళోజి నారాయణరావు. రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కాళోజి. ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు.

తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.

కాళోజీ పూర్తి పేరు "రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాం రాజా కాళోజి". ఈయన 1914, సెప్టెంబరు 9 న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. కాళోజీ నారాయణరావు తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. 

కాళోజీ అనగానే ‘నా గొడవ’ గుర్తుకొస్తుంది. ‘నా గొడవ’ అంటే వ్యక్తిగతమైంది కాదు. సమకాలీన సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వాటిని అధిక్షేపిస్తూ అవన్నీ ‘నా గొడవ’ అన్నారు కాళన్న. ‘అవనిపై జరిగేటి అవకతవకలకు ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు’ అంటూ.. ప్రపంచంలో జరుగుతున్న గందరగోళాలన్నిటికీ కాళోజీ కలం స్పందించింది.. కవితల తూటాలు చిందించింది. అడ్డమైన మురికినంతా తన్నేసే జీవనది.. ఆయన ‘గొడవ’.

‘అన్యాయాన్నెదిరిస్తే
నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే
నా గొడవకు ముక్తి ప్రాప్తి
అన్యాయాన్నెదిరించినోడు
నాకు ఆరాధ్యుడు’ - కాళోజీ.
Kaloji Narayana Rao
Kaloji Narayana Rao
ఇలా ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి.


‘ఉదయం కానేకాదనుకోవడం నిరాశ.. ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ’ అంటూ మార్గనిర్దేశనం చేశారు ప్రజాకవి కాళోజీ. ఆయన కలం అంకుశం.. అవనిపై అవకతవకలకు ఆయన మనసు కకావికలమైంది. పుటుక నీది చావు నీది.. బతుకు దేశానిది.. వందేళ్ల కిందట పుట్టి వెయ్యేళ్లకు సరిపడా మెదళ్లను కదలించిన ఈ శతాబ్దపు మేటి కవి మన కాళన్న. నిజాం ముష్కర పాలనకు, సమాజంలోని కుళ్లూ, కుతంత్రాలకు వ్యతిరేకంగా గళమెత్తిన కాళన్నకు శతకోటి దండాలు పెట్టినా తక్కువే.

పరభాషా జ్ఞానాన్ని సంపాదించుకోవడం అవసరమే. కానీ, ఆ సాకుతో అమ్మ లాంటి మన భాషను నిర్లక్ష్యం చేయడం ఎంత తప్పు. నేటి తరం.. తెలుగు పదాలనే మర్చిపోతోంది. ఈ పరిస్థితి పోవాలి. మన తేటతెలుగు భాషకు పూర్వ వైభవం రావాలి.


ప్రతి భాష ఒక దేవాలయం. ఎవరి యాస వారికే గొప్ప. మన భాషను, యాసను, చరిత్రను సగర్వంగా చెప్పుకునే తరుణం వచ్చింది. ఏళ్లుగా అణిగిమణిగి ఉన్న తెలంగాణ యాస.. ఇప్పుడు అత్తరు పరిమళాలతో కొత్త సొబగులను అద్దుకుంది. ఈ సంస్కృతీ.. సంప్రదాయాలిప్పుడు లోకానికి కొత్త రుచిని చూపిస్తున్నాయి. ఇప్పటిదాక ఇంట్లొక మాట.. బయటొక మాటగా మన భాష తీరు ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితికి కాలం చెల్లింది.

మన యాసలో మనం రొమ్ము విరుచుకొని మాట్లాడే నూతనోత్సాహం వచ్చేసింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచే మొదలైన మార్పు ఇప్పుడు ఉద్యమ రూపంలో కొంత పుంతలు తొక్కుతోంది. ఇదే స్ఫూర్తితో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి.. తెలంగాణ వేషభాషల తొలిసూరు బిడ్డ లాంటి కాళోజీ నారాయణరావు 105 వ జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా.. ఆయనకు మనమిచ్చే గౌరవం ఇంతకంటే గొప్పగా వేరే ఏముంటుంది?

ఆయన తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. ఆయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు. ఆయన స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. ఆయన 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం గా చేసి గౌరవించింది[4]. వరంగల్ లో నెలకొన్న వైద్య విద్యాలయానికి ఆయన పేరు పెట్టబడింది.

తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.

కాళోజీ జన్మించిన అయిదారు నెలలకే రమాబాయమ్మ చనిపోవడంతో అన్నే అమ్మగా మారి తమ్ముడు కాళోజిని పెంచి పెద్దచేశాడు. కాళోజి రామేశ్వరరావు ఆయన అన్న, ఉర్దూ కవి. తమ్ముడికన్నా అన్న ఆరు సంవత్సరాలు పెద్ద. కాళోజీ రామేశ్వరరావు ‘షాద్’ పేరుతో ఉర్దూ కవిత్వం రాశాడు. తమ్ముడి హైపర్‌యాక్టివ్‌తనం వల్ల ఆయన ప్రభ వెనకబడిపోయినా వాళ్లిద్దరూ అన్యోన్యంగా బతికారు. 

ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్ న్యాయపాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజీ లోనూ, హన్మకొండ లోని కాలేజియేట్ ఉన్నత పాఠశాల లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు. 1939 లో హైదరాబాదు లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రం లో పట్టా పొందాడు. న్యాయ శాస్త్రం చదివుండీ కాళోజీ ఏనాడూ రూపాయి సంపాదించకపోయినా ఆయనే ఇల్లు గడుపుతూ వచ్చాడు. ఒకవిధంగా తండ్రి తర్వాత తండ్రిలా సాక్కుంటూ వచ్చాడు. 1996 లో రామేశ్వరరావు చనిపోయినప్పుడు, ‘నేను నా ఆరవయేట మా అన్న భుజాల మీదికెక్కినాను. ఆయన మరణించేదాకా దిగలేదు. నేను ఆయన భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. 70 ఏళ్ల వరకూ ఆయన నన్ను దించకుండా ఉండడం గొప్ప.’ అన్నాడు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమం లో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది. 1940 లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది.

మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945 లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. తెలంగాణ ల నిజాం జమానాల నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను సాహసికంగా ఎదిరించిండు. ఆర్యసమాజ్ సభలు, ఊరేగింపులు, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కార్యకలాపాలు, రచయితల సభలు, అన్నీ కాళోజి భాగం పంచినయి. సహ యువకుల్ని చైతన్యంలకి మళ్లించారు.  గాంధీ అహింసామార్గాన్నే శిరసావహించినా అవసరాన్ని బట్టి ప్రతిహింసను కూడా ఆహ్వానించారు.  నిజాం వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో కవితలు రాసారు. నిజాం దుష్కృత్యాల్ని తన సహజ శైలిల తూర్పారబట్టారు.

1953 లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.

ఆయన ఆంధ్రప్రడేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 1958 నుండి 60 వరకు పనిచేసారు. రెండేళ్లు ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు. ఆయన "ఆంధ్ర సారస్వత పరిషత్" వ్యవస్థాపక సభ్యుడు మరియు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీలో సభ్యుడు. ఆయన తెలంగాణ రచయితల సంఘం అధ్యకునిగనూ, 1957-61 కాలంలో గ్లోసరీ కమిటీ సభ్యునిగానూ ఉన్నారు. 1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పై పోటీ చేశాడు కానీ ఓడిపోయారు.

పురస్కారాలు, గౌరవాలు
1992 : పద్మవిభూషణ్ - భారత రెండవ అత్యున్నత పురస్కారం
1972 : తామ్రపత్ర పురస్కారం.
1968 : "జీవన గీత" రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అనువాద పురస్కారం.
బూర్గుల రామకృష్ణారావు మెమోరియల్ మొదటి పురస్కారం.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే 1981లో సత్కారం.
"ప్రజాకవి" బిరుదు.
ఆంధ్రప్రదేశ్ లో అనేక సాహితీ సంఘాలచే సన్మానాలు.
రామినేని ఫౌండేషన్ అవార్డు
గాడిచర్ల ఫౌండేషన్ అవార్డు
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ వారు 1992 లో డాక్టరేట్ ప్రదానం చేసారు.
1996లో సహృదయ సాహితీ విశాఖ వారి గురజాడ అవార్డు.
1996లో కళసాగర్ మద్రాస్ వారి విశిష్ట పురస్కారం.

రచనలు:

ఆయన మరాఠీ, ఇంగ్లీషు,ఉర్దూ భాషల్లో పండితుడు. ఎన్నో ఇతర భాషా గ్రంథాలను తెలుగు లకి అనువదించారు.
అణా కథలు
నా భారతదేశయాత్ర
పార్థివ వ్యయము
కాళోజి కథలు
నా గొడవ
జీవన గీత
తుదివిజయం మనది
తెలంగాణ ఉద్యమ కవితలు
ఇదీ నా గొడవ
బాపూ!బాపూ!!బాపూ!!!
1943 లోనే ఆయన కథల్ని "కాళోజీ కథలు" పేరుతో అప్పట్లో హైదరాబాదులో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన అణాగ్రంథమాల సంస్థ తన పద్నాలుగో ప్రచురణగా ప్రచురించింది.
తెలంగాణా వాదం
నిజాం ఆగ్రహించి కాళోజికి వరంగల్ నగర బహిష్కారం విధించిండు. కాళోజి మరింత తీవ్రంగా అంకితభావంతో అక్షరం సంధించిండు. 1939 ల, 1943 ల రెండుసార్లు జైలు కి పోవాల్సివచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు పాములపర్తి సదాశివరావు తో కలిసి తెలంగాణా ప్రత్యేక సంచిక వెలువరించాడు. విశాలాంధ్ర కావాలనీ అన్నాడు. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణా కావాలనీ అన్నాడు.
ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రమహాసభ, తెలంగాణ రచయితల సంఘం సంస్థల నిర్మాణలలో కాళోజి భాగం ఉంది.
పి.వి.నరసింహారావు లాంటి ఎందరికో ఆయన సాహిత్యంల, రాజకీయాల్లో మార్గదర్శనం చేశాడు.
విశాలాంధ్ర సమస్యలు గమనించి ఆయన 1969 ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కలిశాడు.
అన్ని సందర్భాలల్లా అసలుసిసలైన తెలంగాణవాది గా జీవించాడు.

ఉల్లేఖనలు
ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె. - కాళోజీ
తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా - కాళోజీ
కాళోజీ నిఖిలాంధ్ర కవి. అందులో ఎట్టి సందేహం లేదు. ఆయనకు తెలంగాణా అంచులు గోడలుగా అడ్డునిలువజాలవు. ఆయన తన ఖండకావ్య సంపుటానికి 'నా గొడవ' అని పేరు పెట్టాడు. అదే కవి ప్రతిభ. అదే కవి చెప్పవలసిందీను. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ - శ్రీశ్రీ
ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక- కాళోజి
పుటక నీది-చావు నీది-బతుకంతా దేశానిదీ --- జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజి

‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ "సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచాడు. అతని మరణానంతరం ఆయన పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here