Ramana-Maharshi Quotes Telugu Idol
Ramana-Maharshi Quotes Telugu Idol

శ్రీ రమణ మహర్షి (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడు తిరుచుజై లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతడు 16 సంవత్సరాల వయస్సులో మోక్షము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై తన బసను ఏర్పాటు చేసుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షము పొందిన తరువాత తనను “అతియాశ్రమి” గా ప్రకటించుకున్నారు.

రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది “మౌనము” లేదా “మౌనముద్ర”. ఇతను చాలా తక్కువగా ప్రసంగించేవాడు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే ప్రసంగాల రూపంలో బోధనలు చేపట్టేవారు. ఇతని బోధనలలోనూ విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.ఎవరైనా ఉపదేశించమని కోరితే, “స్వీయ శోధన” ఉత్తమమని, దీనిద్వారా మాత్రమే మోక్షము సాధ్యమని బోధించేవాడు. తన బోధన అద్వైతం, జ్ఞానయోగా లతో ముడివడియున్ననూ, భక్తిని ప్రధానంగా బోధించేవారు.

శ్రీ రమణ మహర్షి గా ప్రఖ్యాతి గాంచిన ఈ మహానుభావుడికి తల్లి తండ్రులు పెట్టిన పేరు ‘వెంకట్రామన్ అయ్యర్‘. భగవాన్ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ ‘ఆరుద్ర దర్శనం‘ నాడు జన్మించారు. శ్రీ భగవాన్ గారి తల్లి తండ్రులు శ్రీమతి అయగమ్మాళ్, శ్రీ సుందరేశం అయ్యర్లు. శ్రీ భగవాన్ గారికి ఇద్దరు సోదరులు(నాగస్వామి, నాగ సుందరం) ఒక సోదరి (అలమేలు). సుందరేశ అయ్యర్ గారు అక్కడ ప్లీడరుగా పని చేసే వారు.
స్వీయ-శోధన ద్వారా మాత్రమే “జ్ఞాన మార్గము”. ఇతడి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతములనే కాకుండా, అనేక మత సారములను మార్గాలను తన బోధనలలో బోధించేవారు.

Famous Ramana Maharshi Quotes: ప్రసిద్ధమైన సూక్తులు

“కోరికలు మితంగా ఉంటే, బాధలూ తక్కువగానే ఉంటాయి”

“ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్ళే విజేతలుగా నిలుస్తారు”

“ఆలోచనలు ఉన్నప్పుడే, అది పరధ్యానం.: ఆలోచనలు లేనప్పుడు, అది ధ్యానం”

“దేవుని సృష్టిలో అంతా సంపూర్ణమైనదే, ప్రజల మనస్సులలో మాత్రమే అనిర్దిష్టత మరియు బాధలు ఉన్నాయి”

“అవసరానికి మించిన సంపద అనర్ధదాయకం”

“కల్పితమైన ‘పాము’ అనే అజ్ఞానపు భ్రమ తొలగితే గానీ దానికి ఆధారమైనది తాడు అనే జ్ఞానం ఎలా కలుగదో, అటులనే ‘ప్రపంచం నిజం’ అనే విశ్వాసం తొలగనంతవరకు దానికి ఆధారమైన ఆత్మ సాక్షాత్కరించదు”

“చెడు వారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది”

“ప్రశాంతత నాలుక నాలుగు రకాల మాటలకు సంబంధించినది, కళ్లకు సంబంధించినది చెవులకు సంబంధించినది, మనసుకు సంబంధించినది, వీటిలో మానసిక ప్రశాంతత ముఖ్యమైనది గొప్పది కూడా”

“ప్రేమ అనేది దేవుని అసలు రూపం”

“చిరునవ్వుల దరహాసంతో వెలిగిపోయే వారితోనే మీరు స్నేహం చేయండి”

Ramana Maharshi Quotes On Life: జీవిత సూక్తులు

“స్పష్టత లేకుండా మాట్లాడటం కంటే మౌనమే మిన్న”

“భగవంతునికి నీవు ఎంత దూరంలో వుంటే, భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు”

“మానవత్వం ఒక సముద్రం వంటిది, సముద్రంలోని కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవటం పొరపాటు, అందుచేత మానవత్వం పై నమ్మకం వదులుకోవద్దు”

“ఎవరూ ప్రయత్నం లేకుండా విజయం సాధించలేరు.. విజయం సాధించిన వారి పట్టుదలకు వారి విజయం రుణపడి ఉంది”

“తనను తాను పాలించుకోలేని వాడు ఇతరులను పాలించాలనుకోవడం విచిత్రం”

“తన గురించి తనకు అవగాహన లేని జ్ఞానం పొందిన వారికి, ప్రపంచం కేవలం ఒక బానిసత్వం కల్పించే ఊహ వలె కనిపిస్తుంది”

“మేధస్సుతో ఉద్భవించే ఆలోచనల పరంపరలో మొదటి ఆలోచన నేను అనునది”

“ఒక శరీరం నుండి వెళ్ళే అన్ని చర్యలు మరియు సంఘటనలు భావన సమయంలో నిర్ణయించబడతాయి”

“ఆనందం మీ స్వభావం, అది కోరుకోవడం తప్పు కాదు”

“మీ చేతులు పని చేయవచ్చు కానీ మీ మనస్సు ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది నీవు ఎన్నడూ కదిలేవాడివి కాదు”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here