రామానాయుడు కొడుకులిద్దరూ సురేష్ బాబు, వెంకటేశ్ లకు ఉత్తమ విద్యనందించారు. అమెరికాలో పట్టభద్రులను చేశారు. సురేష్ బాబు సొంత బిజినెస్ ప్రారంభించడానికి అమెరికా నుంచి రాగా.. ఎంబీఏ తరువాత వెంకటేశ్ ఇండియాకు తిరిగివచ్చాడు.

అయితే టాలీవుడ్ లో గొప్ప నిర్మాతగా పేరు తెచ్చుకున్న రామానాయుడు తన కుమారులిద్దరూ సినిమా వ్యాపారంలోకి రావాలని అస్సలు కోరుకోలేదట. ప్రారంభ దశలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న రామానాయుడు తన కొడుకులకు ఈ సినిమా రంగం కంటే వేరే వ్యాపారాల్లో, మంచి వృత్తిలో స్థిరపడేలా చేయాలని అనుకున్నాడట. సినిమాలంటేనే పెద్ద జూదం అని… బాగా చదువుకున్న తమ పిల్లలు సురేష్ బాబు, వెంకటేశ్ లకు ఉత్తమ కెరీర్ ను చూపించాలని అనుకున్నాడట. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు చెప్పిన ఈ విషయాలు తాజాగా హాట్ టాపిక్ గా మారాయి.

మీ చిన్న కొడుకు వెంకటేశ్ బాగున్నాడని.. అతడినే హీరోను చేయాలని రామానాయుడుకు సూచించాడట. అలా 1986లో ‘కలియుగ పాండవులు’ చిత్రం ద్వారా వెంకటేశ్ హీరోగా ఎంట్రీ ఇవ్వగా..1990లో వచ్చిన ‘బొబ్బిలి రాజా’ బ్లాక్ బస్టర్ హిట్ తో వెంకటేశ్ స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు. సురేష్ బాబు నిర్మాతగా మారి ఇద్దరూ కలిసి ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. #Hero_Venkatesh #Venky Mama #Director_SureshBabu #CreativeDirector_RaghavendraGaru #ShowMen #TeluguIdol #HotTopic #Naarappa_F2_ Movie #Tollywood

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here