Raw Meterial for Covid-19 Vaccin .. వాక్సిన్ కోసం వాడే ముడి పదార్ధాల.
Raw Meterial for Covid-19 Vaccin .. వాక్సిన్ కోసం వాడే ముడి పదార్ధాల.

Raw Meterial for Covid-19 Vaccin .. వాక్సిన్ కోసం వాడే ముడి పదార్ధాల.

1.Viral Vectors [వైరల్ వెక్టర్స్]mRNA.
ఇది ముఖ్యమయిన రా మెటీరీయల్ అడినోవైరల్ వాక్సిన్ [Adenoviral Vaccines] తయారు చేయాలంటే. ఇది 84% అమెరికా,జర్మనీ చేతుల్లో ఉంది. 59% అమెరికన్ ఫార్మా చేతుల్లో ఉంటే మిగతా 25% జర్మనీ ఫార్మా చేతిలో ఉంది. రష్యా దగ్గర ఉంది కానీ తన అవసరాలకి తగ్గట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తుంది కానీ ఎగుమతి చేయలేదు. ఫ్రాన్స్ చాలా కొద్ది మొత్తంలో తయారు చేస్తుంది కానీ అది కూడా తన అవసరాలు తీరిన తరువాత మాత్రమే ఎగుమతి చేస్తుంది. చైనా ఇంకా పూర్తిగా పట్టు సాధించలేకపోయింది.చైనా ఇంకా పరిశోధనల దగ్గరే ఉంది ఈ వైరల్ వెక్టర్స్ ని ఉత్పత్తి చేయడంలో కాబట్టి చైనా ఎగుమతి చేయలేదు. ఈ వైరల్ వెక్టర్స్ కావాలంటే అమెరికా లేదా జర్మనీ మాత్రమే సప్లై చేయగలవు. అమెరికా భారత దేశానికి ఈ వైరల్ వెక్టర్స్ ఎగుమతుల మీద జనవరిలో నిషేధం విధించింది అక్కడి ఫార్మా లాబీ ఒత్తిడికి లొంగి. చాలా చాలా క్లిష్టమయిన ప్రక్రియ ఇది తయారు చేయాలంటే. మనకి ఇంకో 50 ఏళ్లు పడుతుంది ఈ టెక్నాలజీ ని సొంతం చేసుకోవాలంటే. ఇది హై లెవల్ బయో టెక్నాలజీ. అమెరికా లేదా జర్మనీ మీద ఆధారపడాల్సిందే దీని కోసం.
2. అడినో వైరల్ వాక్సిన్ తయారు చేయడానికి రెండో ముఖ్యమయిన రా మెటీరీయల్ సింథటిక్ ప్రోటీన్[Synthetic Proteins]. ఇది కూడా అమెరికా లేదా జర్మనీ నుండి రావాల్సిందే. రెండో బెస్ట్ దక్షిణ కొరియా. కానీ దక్షిణ కొరియా ప్రొడక్షన్ చాలా తక్కువ కానీ మనం అడిగితే సప్లై చేయగలదు కానీ కొరియా అమెరికా రక్షణలో ఉంది కాబట్టి అమెరికా ని కాదని మనకి ఇవ్వలేదు. ఇది కూడా వెస్ట్ లేదా యూరోపు ఆధిపత్యంలో ఉంది.
3. బయోరియాక్టర్ బాగ్ [BioReactor Bag ] ఒక సారి వాడి పడేసే డీస్పోసబుల్ బయో ప్లాస్టిక్ బాగ్. దీనిని కృత్రిమంగా కణాలు [cells]ని ఉత్పత్తి చేయడానికి వాడతారు అలాగే వైరస్ కాణాలని వృద్ధి చేయడానికి వాడతారు. ఈ బాగ్ కాంటామినేట్ కాకుండా వాక్సిన్ ఉత్పత్తి కోసం వాడతారు. ఇవి 2000 లీటర్ల పరిణామం లో ఉంటాయి కాబట్టి ఒక సారి వాక్సిన్ ఉత్పత్తి అయ్యాక అంటే ఒక బాచ్ వాక్సిన్ ఉత్పత్తి అయ్యాక వీటిని నాశనం చేస్తారు. ఇవి Sartorius Stedim Biotech (France), Thermo Fisher Scientific (US), Danaher Corporation (US), and Merck Millipore (Germany) are the prominent players operating in the single-use bioreactors market. వరసగా అమెరికా,జర్మనీ , ఫ్రాన్స్ ల చేతిలో ఉంది వీటి ఉత్పత్తి. చైనా కూడా తయారుచేస్తున్నది కానీ అది అంత క్వాలిటీ కాదు. కాబట్టి ఈ బయోరియాక్టర్ సింగిల్ యూజ్ బాగ్స్ కోసం కూడా అమెరికా ,యూరోపు మీద ఆధార పడాల్సిందే.
4. ఫిల్టర్స్ [Filters]. ఇవి బయోరియాక్టర్ బాగ్ నుండి వాక్సిన్ ని ఫిల్టర్ చేయడానికి అలాగే స్టెరిలైజ్ చేయడానికి వాడతారు ఆఫకోర్స్ ఇవి కూడా అమెరికా ,జర్మనీ,ఫ్రాన్స్ నుండి కొనాల్సిందే బయో రియాక్టర్ లతో పాటు.
5. సెల్ కల్చర్ మీడియా [CellCulture Media ]Inactivated Viral Vector Sub-unit. ఒక రకమయిన జెల్ లాంటిది లేదా లిక్విడ్ ఇది. దీనిలో వివిధ రకాలయిన కొంపౌండ్స్ తో పాటు పోషకాలు కలుపుతారు లాబ్ లో వైరస్ కణాలు వృద్ధి చెందడానికి.
6. లిపిడ్ నానో పార్టికిల్స్ [Lipid Nano Particles ]. జంతు సంబంధిత కొవ్వు నుండి కాకుండా వేరే కొవ్వు [Non Animal Cholestarol ]తో పాటు, నానో ఫ్లూయిడ్స్,మైక్రో ఫ్లూయిడ్స్ ని కలిపి తయారు చేస్తారు దీనిని. ఈ లిపిడ్ నానో పార్టికిల్స్ వాక్సిన్ ని తీయడానికి వాడతారు. ఇది కూడా షరా మామూలే.
7. మైక్రో కారియర్స్ బీడ్స్ [Micro Carrier Beads]. చిన్న గోళాకారం లో ఉంటాయి ఇవి. ఇవి ప్రోటీన్ ఉత్పత్తి చేయడాని వాడతారు దీనివల్ల వైరస్ కణాలు లేదా వాక్సిన్ కణాలు ఉత్పత్తి అవడానికి దోహదం చేస్తుంది. ఇవి నాన్ టాక్సిక్ మెటీరీయల్ తో తయారుచేస్తారు. ఈ టెక్నాలజీ కూడా చాలా కొద్ది దేశాల చేతిలో ఉంది. వాక్సిన్ తయారీలో ఇవి కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
పూణే లోని సీరం ఇన్స్టిట్యూట్ కి UK లోని ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనీక నుండి ఈ రా మెటీరీయల్ తో పాటు ఫార్ములా కూడా వస్తుంది. అలాగే సీరం ఇన్స్టిట్యూట్ ఆస్ట్రా జెనీక తీసుకున్న ఆర్డర్ల ని తీసుకొని వాళ్ళకి సప్లై చేసిన తరువాత మన దేశంలో కూడా అమ్ముకోవచ్చు అలాగే మన దేశంలో అమ్మే వాక్సిన్ కి రాయల్టీ కూడా ఇవ్వాలి ఆస్ట్రా జెనీక కి. కొవీషీల్డ్ వాక్సిన్ అనేది మన స్వంత ఫార్ములా కాదు. ప్రతీ వాక్సిన్ డోస్ కి సీరం ఇన్స్టిట్యూట్ రాయల్టీ ఇవ్వాల్సి ఉంటుంది. సీరం ఇన్స్టిట్యూట్ విదేశాలకి సప్లై చేసిన వాటిలో సింహా భాగం UK ఆస్ట్రా జెనీక ఆర్డర్స్. కాకపోతే బల్క్ లో తయారుచేసే ఫెసిలిటీ వాళ్ళకి లేదు కాబట్టి మన దేశంలో తయారుచేస్తున్నారు. అంతే కానీ ఇష్టం వచ్చినట్లు విదేశాలకి ఇవ్వడానికి సీరం కి అధికారం లేదు. శ్రీ లంక,బంగ్లాదేశ్, భూటాన్,మాల్దీవులు,నేపాల్ దేశాలకి వాక్సిన్ డిప్లొమసి కోసమే పరిమితంగా ఇచ్చారు. అలాగే బంగ్లాదేశ్ పాటు శ్రీలంక,నేపాల్ దేశాలు తుదుపరి వాక్సిన్ కోసం సీరం ఇన్స్టిట్యూట్ కి ఆర్డర్ ఇచ్చాయి. ఉచితంగా స్నేహపూర్వకంగా ఇచ్చినవి ఆయా దేశాలలో వాటి ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడానికే ఇచ్చారు. అలాగే కర్టసీ కోసం WHO కి విరాళంగా ఇచ్చింది సీరం ఇది తప్పని సరి ఎందుకంటే వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి పెద దేశాలకి WHO నుండి సరఫరా అవుతాయి కాబట్టి ఈ పని వాక్సిన్ తయారు చేసే అన్నీ దేశాలు కూడా ఇచ్చాయి.
గత జనవరి లో జో బిడెన్ భారత్ కి ఇచ్చే పైన పేర్కొన్న రా మెటీరియల్ మీద నిషేధం విధించాడు దాంతో ఉన్న స్టాక్ తోనే సీరం ఇప్పటివరకు నెట్టుకు వచ్చింది కాబట్టి ఉత్పత్తి తగ్గి షార్టేజ్ వచ్చింది.
అజిత్ దోవల్ అమెరికా భద్రత సలహాదారుతో ఫోన్ లో మాట్లాడిన తరువాత 15 రోజుల క్రితం అమెరికా వాక్సిన్ రా మెటీరీయల్ మీద నిషేధం తీసివేసింది. మళ్ళీ యధా పూర్వ స్థితిలో వాక్సిన్ ఉత్పత్తి జరుగుతున్నది ఇప్పుడు. ముంబై లోని vav life sciences లాబొరేటరీ నుండి అమెరికా లో వాక్సిన్ తయారుచేసే సంస్థలకి కొన్ని ముఖ్యమయిన రా మెటీరీయల్ వెళుతుంది అయితే అజిత్ దోవల్ చాలా స్పష్టంగా వాటి మీద భారత్ నిషేధం విధిస్తుంది అని ఖచ్చితంగా చెప్పేసరికి అమెరికా దిగి వచ్చింది. అంటే వాక్సిన్ విషయంలో భారత ప్రభుత్వం ఎంత ఖచ్చితంగా ఉందో తెలుస్తున్నది కదా ? ట్రంఫ్ అధికారంలో ఉన్నప్పుడు హైడ్రాక్సిన్ క్లోరో క్వీన్ ని యుద్ధ ప్రాతిపదిక మీద అటు అమెరికా కి ఇటు జర్మనీ కి కూడా సప్లై చేసిన విషయాన్ని గుర్తు చేశారు శ్రీ అజిత్ దోవల్. కధ ఇక్కడితో ఆగిపోలేదు యూరోప్ లో ఆస్ట్రా జెనీక మీద కోర్టులో కేసు వేశారు వాక్సిన్ సప్లై విషయం జాప్యం చేస్తున్నందుకు అది పరోక్షంగా UK అమరికా ల మధ్య విభేదాలకి కూడా దారి తీయవచ్చు ఒక వేళ కోర్టు నష్ట పరిహారం కట్టమంటే. కేసులు వేసింది సీరం ఇన్స్టిట్యూట్ మీద కానీ రా మెటీరీయల్ ఇవ్వాలసింది అమెరికా సంస్థలు ఎందుకంటే ముందే చేసుకున్న ఒప్పందం లేదా అగ్రిమెంట్ ని పూర్తి చేయాల్సిన బాధ్యత అమెరికన్ ఫార్మా సంస్థలదే ఇదే విషయాన్ని దోవల్ స్పష్టంగా చెప్పాడు.
సీరం ఇన్స్టిట్యూట్ వాక్సిన్ ఉత్పత్తి సామర్ధ్యం నెలకి 6 నుండి 8 మిలియన్ డోసులు అంటే నెలకి 60 లక్షల డోసుల నుండి 80 లక్షల డోసులు. అలాగే ఇప్పటి వరకు 3 కోట్ల 38 లక్షల డోసులు EU కి సరఫరా చేసింది సీరం ఇది ఆస్ట్రాజెనీక ఆర్డర్. అలాగే 8 కోట్ల 50 లక్షల డోసులని భారత ప్రభుత్వానికి సరఫరా చేసింది సబ్సిడీ రేట్ల మీద ఈ డాటా ఏప్రిల్ 30 వ తేదీ 2021 నాటిది.
భారత దేశ జనాభా 132 కోట్లు అలాగే రెండు డోసులు ఇవ్వాలంటే 264 కోట్ల డోసుల అవసరం ఉంది. సీరం ఇన్స్టిట్యూట్ నెలకి 80 లక్షల డోసుల ఉత్పత్తి సామర్ధ్యం మాత్రమే అంటే దేశం మొత్తానికి ఇవ్వాలంటే 2022 జులై నెల వరకు ఆగాల్సిందే. ఇక భారత్ బయోటెక్ కోవాక్సిన్ కి రా మెటీరీయల్ కొరత లేదు ఎందుకంటే కోవాక్సిన్ ఫార్ములా వేరు కాబట్టి అయితే భారత్ బయోటెక్ సామర్ధ్యం చాలా తక్కువ. షుమారుగా నెలకి 10 లక్షల డోసులు మాత్రమే తయారుచేయగలదు అలాగే రా మెటీరీయల్ చైనా నుండి దిగుమతి చేసుకోవచ్చు. అయితే చైనా ధరలు పెంచి యూరోపియన్ యూనియన్ కి ఇచ్చే ఎక్కువ ధరకే ఇస్తామని ప్రకటించింది అందుకే వాక్సిన్ ధరలు పెంచారు. ఎలా చూసినా వాక్సిన్ ధర మన దేశంలోనే చాలా తక్కువ.
ఇష్టం వచ్చినట్లు వాక్సిన్ ని విదేశాలకి ఇచ్చారని వాగే వాళ్ళకి అది ఆస్ట్రాజెనీక మార్కెటింగ్ వ్యూహం తప్పితే తప్పిదం కాదు. సీరం ఇష్టం వచ్చినట్లు ఎవరికీ ఇవ్వడానికి అధికారం లేదు. ఇస్తే కోవాక్సిన్ ఇవ్వవచ్చు అది మన దేశం లోది కాబట్టి కానీ భారత్ బయోటెక్ సామర్ధ్యం చాలా తక్కువ కనుక ఫ్రెండ్షిప్ గెశ్చర్ కింద ఇవ్వలేదు. SO! ఇష్టారాజ్యంగా విమర్శలు గుప్పించే వారికి చెప్పేది ఏమిటంటే ఉచితంగా ఇచ్చింది ఆస్ట్రా జెనీక కానీ భారత ప్రభుత్వం కాదు. వాళ్ళ మార్కెటింగ్ కోసమే ఆ పని చేశారు కాకపోతే దేశ అత్యున్నత వ్యవస్థలో భాగమై భారత దేశం ఇస్తున్నది అని చెప్పారు. ఆస్ట్రా జెనీక అనుమతి లేకుండా ఇవేవీ జరగవు.

Raw Meterial for Covid-19 Vaccin .. వాక్సిన్ కోసం వాడే ముడి పదార్ధాల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here