Rice Home Delivery Start from September 1st AP .. సెప్టెంబరు 1 నుంచి బియ్యాన్ని లబ్ధిదారులకి హోమ్ డెలివరీ .. ముఖ్యమంత్రి జగన్
ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో బియ్యం డోర్ డెలివరీ ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఈ ప్రాజెక్టు ఆ జిల్లాలో విజయం సాధించడంతో రాష్ట్రం మొత్తం డోర్ డెలివరీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు.

సెప్టెంబరు 1 నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే హోమ్ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.
అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకు రావాలని ఆయన అన్నారు. పౌరసరఫాల శాక సమీక్షలో ఆయన ఈ ఆదేశాలు ఇచ్చారు.
ఎన్నికల హామీల్లో భాగంగా నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని హోమ్ డెలివరీ చేస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
అప్పుడిచ్చిన మాటను సెప్టెంబర్ 1 నుంచి అమలుపరిచే విధంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Rice Home Delivery Start from September 1st AP .. సెప్టెంబరు 1 నుంచి బియ్యాన్ని లబ్ధిదారులకి హోమ్ డెలివరీ .. ముఖ్యమంత్రి జగన్