Balakrishna Roja Telugu Idol
Balakrishna Roja Telugu Idol

నందమూరి బాలకృష్ణ వరుస ఫ్లాపుల తర్వాత ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తుంది. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టినా కరోన వైరస్ కారణంగా ఆగిపోయింది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చెయ్యాలి అని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని మీద బలాక్రిష్ణ అభిమానుల్లో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరా గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. బాలకృష్ణ ఈ సినిమా కోసం బరువు కూడా పెరిగారు అని అంటున్నారు.

Balayya Roja Telugu Idol
Balayya Roja Telugu Idol

ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం ఇప్పుడు ఎమ్మెల్యే రోజా ను అడిగినట్టు సమాచారం. రోజా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు అని అంటున్నారు. ఎంత వరకు నిజమో తెలియదు గాని ఈ సినిమాలో ఆమె బాలకృష్ణ భార్యగా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా కోసం ఆమె భారీగా కూడా డిమాండ్ చేయలేదు అని సమాచారం. కథ బాగా నచ్చడం తో ఆమె ఈ సినిమాను చేయడానికి ముందుకు వచ్చారు అని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బాలకృష్ణ ఆమెను అడగగా ఆమె కూడా ఓకే అన్నారని సమాచారం.

కథలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని టాక్. అందుకే ఆమె ఓకే చేసారని అంటున్నారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ గుండు కూడా చేయించుకున్నారు. కథ లో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి అనే విషయం అర్ధమవుతుంది. ఈ సినిమా కోసం బాలకృష్ణ వేరే సినిమాలను కూడా ఓకే చేయడం లేదని అంటున్నారు. అయితే బాలకృష్ణ భార్యగా ఆమె ఏ విధంగా నటిస్తారు అంటే ఇందులో రెండు పాత్రల్లో బాలకృష్ణ కనపడే అవకాశం ఉందా అనేది అర్ధం కావడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here