Mahesh-Babu Telugu Idol
Mahesh-Babu Telugu Idol

భరత్ అను నేను, మహర్షి చిత్రాల తర్వాత మహేష్ బాబు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ‘మాస్టర్ బ్లాస్టర్’ అనిపించుకున్నాడు మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించడంతో పాటు.. టాలీవుడ్ హైయెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాగా ఈ చిత్రం నేటికి 100 డేస్ పూర్తి చేసుకుంది. 2020 జనవరి 11న విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ నేటికి విడుదలై 100 రోజులు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా దిల్ రాజు మరియు మహేష్ నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు.

Sarileru Neekevvaru Telugu Idol
Sarileru Neekevvaru Telugu Idol

లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, సంగీత, రావు రమేష్, హరితేజ, అజయ్, జయప్రకాశ్ రెడ్డి, సత్యదేవ్, రఘుబాబు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటించారు. గత కొద్దిరోజులుగా సందేశాత్మక సినిమాలు చేసుకుంటూ వస్తున్న మహేష్ ఈ సారి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ మొదటిసారి ఆర్మీ లుక్ లో కనిపించడం.. 13 ఏళ్ల తరవాత లేడి అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తుండడంతో సినిమాపైన అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను నిజం చేస్తూ సరిలేరు నీకెవ్వరూ అంటూ థియేటర్లలో దుమ్ము దులిపిందని చెప్పవచ్చు. కలెక్షన్ల దగ్గర బేరాల్లేవమ్మా అంటూ బాక్సాఫీస్ షేక్ చేసాడు.

Sarileru-Neekevvaru-Telugu-Idol
Sarileru-Neekevvaru-Telugu-Idol

ఇక సూపర్ స్టార్ తన కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్, కియారా అద్వానీ, సారా అలీఖాన్ లలో ఎవరో ఒకరు నటించే అవకాశాలున్నాయట. ఈ చిత్ర షూటింగ్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న ప్రారంభమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కనున్న ఆ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావ పరిస్థితులను బట్టి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి. అన్నింటికీ మించి రాజమౌళి తన నెక్స్ట్ సినిమా మహేష్ తో అని ప్రకటించడం విశేషం. దీంతో మహేశ్‌ ఫ్యాన్స్‌ సూపర్‌ కాంబినేషన్‌ ఫిక్స్‌ అయ్యిందని సంబరపడిపోతున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్ నారాయణ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ చిత్రం 2021 ఇయర్ ఎండింగ్ లేదా 2022 ఫస్ట్ హాఫ్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here