Veda Seeds Donates Ambulance for Poor and Orphan People
Veda Seeds Donates Ambulance for Poor and Orphan People

Veda Seeds Donates Ambulance for Poor and Orphan People .. రుద్ర ఛారిటబుల్ ట్రస్ట్ కి అంబులెన్స్ ను అందచేసిన వేద సీడ్స్ డైరెక్టర్ తులసి ధర్మ చరణ్.

రుద్ర ఛారిటబుల్ ట్రస్ట్ కి అంబులెన్స్ ను అందచేసిన వేద సీడ్స్ – కంఠాస్ సంజీవని హాస్పిటల్ యాజమాన్యం.

గుంటూరు- గుంటూరు నగరంలోని పేద, బడుగు బలహీన వర్గాలకు నిర్విరామంగా సేవలు అందచేస్తున్న రుద్ర ఛారిటబుల్ ట్రస్ట్ కు.. వేద సీడ్స్ , కంఠాస్ సంజీవని సైకీయాట్రి హాస్పిటల్ యాజమాన్యం అంబులెన్స్ ను ఉచితంగా అందజేశారు.

ఈ సందర్భంగా వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మ చరణ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో రుద్ర చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్న సేవలకు మనం వెలకట్టలేమని, ఆకలితో చేయి చాచిన వారికి కాదనకుండా, కరోన సోకిన వారికి కడుపునిండా ఆహారాన్ని అందచేస్తూ వారి గొప్ప మనసును చాటుకున్నారని అభినందించారు.

గత ఏడాది నుండి నేటి వరకు కరోనాతో మరణించిన వారి దహన సంస్కారాలను చేస్తున్న ట్రస్ట్ వారికి సహాయంగా ఉంటుందనే ఈ అంబులెన్స్ ను ట్రస్ట్ వారికి అందచేస్తున్నట్లు ధర్మచరణ్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కరోన విజృంభణ భయంకరంగా ఉందని , కావున ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

అందరూ తప్పనిసరిగా మాస్క్ ను ఉపయోగిస్తూ ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని.. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే ఆశ్రద్ధ వహించకుండా దగ్గరలోని హాస్పిటల్ కి వెళ్లి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎమ్. డి డా. కంఠా జగదీష్, కదరి గణేష్, పుల్లగుర చంద్రశేఖర్, ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు సుభాని, మస్తాన్ పాల్గొన్నారు.

రుద్ర ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులుకు అంబులెన్స్ ను అందచేస్తున్న వేద సీడ్స్ ఈ.డి తులసి ధర్మచరణ్, తదితరులు.

Veda Seeds Donates Ambulance for Poor and Orphan People .. రుద్ర ఛారిటబుల్ ట్రస్ట్ కి అంబులెన్స్ ను అందచేసిన వేద సీడ్స్ డైరెక్టర్ తులసి ధర్మ చరణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here