Women are Practicing Social Distance While Standing in a Queue to Buy Liquor .. మద్యం కోసం క్యూలో నిల్చున్న మహిళలు. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. దీంతో ప్రజారవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర సరుకులు మినహా అన్ని షాపులు బంద్ అయ్యాయి.
దీంతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెల్సిందే. ఇదిలా ఉంటే మద్యంబాబు బాధలు వర్ణాణాతీతం.
మద్యంప్రియులకు మద్యం దొరకక కొందరు అనారోగ్యం ఆస్పత్రి పాలు కాగా మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అనేక వెలుగుచూశాయి.
ఈనేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ 3.0ను మే 17వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు కొన్ని సడలింపులు ఇస్తూ ఆయా రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేసింది.
కొన్ని షరతులతో మద్యం దుకాణాలను తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
ఈమేరకు ఆయా రాష్ట్రాల్లో నేటి నుంచి మద్యం షాపులు తెరుచుకున్నాయి.
తెలుగులో రాష్ట్రాల్లో కేవలం ఏపీలో నేడు ఉదయమే మద్యం షాపులు తెరుచుకోగా తెలంగాణలో మాత్రం మద్యం షాపులు తెరుచుకోలేదు.
తెలంగాణలో మద్యం షాపులు తెరిచేందుకు ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 5న జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మద్యం కోసం క్యూలో నిల్చున్న మహిళలు
ఏపీలో నేటి ఉదయం నుంచే మద్యంప్రియులు బారులు తీరారు. కొన్ని ఏరియాల్లో కిలోమీటర్ల కొద్ది బారులుతీరి కన్పించారు. ఏపీకి సరిహద్దు జిల్లాల్లో ఉన్నవారు ఏపీలోని మద్యం షాపులకు వెళ్లి మద్యం కొనుగోలు చేస్తున్నారు.

తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి కేవలం అర కిలోమీటర్ దూరంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాకకు చెందిన ఓ మద్యం దుకాణం ఉంది.
దీంతో తెలంగాణలోని మద్యంప్రియులు అక్కడికి మద్యం షాపుకు వెళ్లి క్యూలైన్లోని నిల్చొని మద్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.
కిలోమీటర్ల కొద్దిగా ఓపికగా నిల్చొని మద్యంబాబులు మద్యం కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Women are Practicing Social Distance While Standing in a Queue to Buy Liquor .. మద్యం కోసం క్యూలో నిల్చున్న మహిళలు.